Posts

Showing posts from March, 2025
 స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం మార్చి నెల 30 నుండి మొదలు...శ్రీ దేవీ భాగవతం ఎనిమిదొవ స్కంధం ఇరవై నాలుగొవ అధ్యాయం ప్రకారం వసంత నవరాత్రుల నివేదనలు  మాస నివేదన:పంచబోజ్యపదార్దములు   తిథి నివేదనలు: పాడ్యమి ‌‌:ఆవు నెయ్యి  విదియ: పంచదార  తదియ: క్షీరం  చవితి:ఆపూపములు పంచమి: అరటి పండు  షష్ఠి: తేనె  సప్తమి: బెల్లం  అష్టమి: నారికేళం  నవమి: పేలాలు
 శ్రీ భువనేశ్వరి మాత...........!! భువనేశ్వరి అనగా పార్వతీదేవి. భువనేశ్వరీ పరమమైనది, శాంతిమయమైనది. కాళి, తార, సుందరీల ప్రకాశమునకు భువనేశ్వరి తెరవంటిది. దశమహావిద్యలు, వామ, కౌళ సంప్రదాయములకు చెందినది. వామ, కౌళములు సిద్ధపురుషులకే గాని సామన్యులకు కాదు, పరమదేవతా అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలనుకుంటే సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్న ఆ దేవి యంత్ర, మంత్ర, తంత్ర, పూజా కల్పానాసారము విధి విధానం తెలుసుకొని అర్చించి దేవీ కృపకు పాత్రులు కావలసి ఉంటుంది. మహామాయయైన భువనేశ్వరీదేవి భువనేశ్వరీ అనగా విశ్వమంతటికి మహారాజ్ఞి.దశమహావిద్యలలో నాల్గవ మహావిద్య శ్రీభువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ మాతకు భాద్రపద శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ విద్యను ఉపాసిస్తే ఆ సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని, సమస్తసిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు భువనేశ్వరీ బీజం హ్రీం. దీనినే మాయా బీజం అని అంటారు మంత్ర శాస్త్ర పరిభాషలో ‘హృల్లేఖ’ అని అంటారు. సమస్త భువన...