మహాకాళి
HOME ARTICLES VIDEOS ? Home » Articles » మహాకాళి Share ? Prev మహాకాళి "అర్థేందు మకుటాం దేవీం వందే వారిధి సంభవాం అంతర్‌జ్వాలా స్వరూపాం తాం జగచ్చైతన్య విగ్రహాం" ఈ స్తోత్రం ముగురమ్మలను, వారికంటే ఆతీతమైన ఆద్యాశక్తిని ప్రస్తుతిస్తున్నది. భక్తులకు దర్శనం ఇచ్చే మూర్తిమత్త్వము, ధ్యానంలో గోచరించే తత్త్వస్ఫూర్తి, యోగ దీప్తిలో కలిగే అద్భుతానుభవం.. సర్వాతీత గుణాతీతయైన పరాంబా లక్షణము... అనీ దీనిలో స్పష్టంగా వర్ణింపబడ్డాయి. దశ మహావిద్యలు ఆమె శక్తి యొక్క ఒక్కొక్క ఆవిష్కార స్థానం. సమస్త శక్తికి ప్రతీక వీరందరిలోనూ కాళి తొలి విభూతి విశేష అవతారం. ఈ తల్లి సృష్టిలోని సర్వబలానికి ప్రతీక. ఇంతకంటే బలవతియైన శక్తి లేదు. ఈమె శత్రు భయంకరురాలు. అతి త్వరగా ప్రవర్తించటం, ఉద్విగ్న స్వభావం ఈ తల్లి లక్షణం. సృష్టిలో ఉన్న మంద లక్షణం, జడత్వం, సోమరితనం ఇవేవి ఆమెకు పడవు. తన వీరత వల్ల అసమ లక్షణాన్ని తొలగించి అంతటినీ దివ్యభావ వాస యోగ్యంగా చేస్తుంది. కాళి అనుగ్రహం అగ్నిజ్వాలవలె జీవుణ్ణి ఆవరిస్తుంది. పరిక్రమించే శక్తే కాళిక ఈ జగత్తులో ప్రతి కదలిక, ప్రవృత్తి, సన్నివేశాలు ఒ...