Posts

Showing posts from March, 2020

శ్రీ దేవీ భాగవతం

శ్రీ మద్దేవిభాగవతం🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 _*శ్రీ దేవి భాగవతం - 1 వ అధ్యాయం*_ 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 *శ్రీ గణాధిపతయే నమః* *శ్రీ మాత్రే నమః* *స్వామియే శరణం అయ్యప్ప* *శ్రీ దేవీ భాగవతమ్‌* *ప్రథమస్కంధము - మొదటి అధ్యాయము* మా బుద్ధుల నాత్మచింతనమునకై ప్రేరించు దేవియు సర్వ చైతన్యరూపయు ఆద్యయు మహావిద్యయు నగు శ్రీ భగవతిని ధ్యానింతుము. శ్రీ దేవీ రూప పరిణామమే సకల చిదచిదాత్మక చరాచరాత్మక జగత్తులగుటచే నామె సర్వరూప. ఆమె చిద్రూపయగుటం జేసి చైతన్య రూప. చైతన్యాత్మికయగు నామెయొక్క పరిణామమగు నీ జగములు నందలి సకలభూతములును చిద్రూపములే కావలయును. కావున నామె సర్వభూతములయందలి చైతన్యమును నై యున్నది. ఆ దేవి సర్వమునకును ఆద్యయును పరతత్త్వ సాక్షాత్కారమునకు సాధనమగు విద్యయును. అట్టి విద్య యొక్క రూపములలో సర్వ శ్రేష్ఠ మగుటచే నాద్య యగునది ప్రణవము. అది ఆద్య. అ+ఆద్య. అకార ఉకార మకారములు ఓమ్‌. అకారము ఆది వర్ణముగా గలది. ఆ ప్రణవ విద్య యొక్క విస్తృత రూపమే గాయత్రీ మంత్రము. ఆ రూపమున శ్రీదేవీ తత్త్వమును ప్రతిపాదించుటయే శ్రీదేవీభాగవతమునందలి ప్రధాన తత్త్వము. శ్రీ గాయత్రీ మంత్రముయొక్క రూపాంతరమే శ్రీ పంచదశీ మహావిద్య. ఆ విద్యయొక్క 'కాదివిద్యా...